September 23, 2026

మీ నోరు మీ మెదడు ఆరోగ్యం గురించి చెప్పగలదని మీకు తెలుసా…

0
photostudio_1764234237399

మీ నోరు మీ మెదడు ఆరోగ్యం గురించి చెప్పగలదా పళ్ళలో వచ్చే చీము లేదా దంత సమస్యలు ఉన్నవారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఒక పెద్ద పరిశోధన చెప్తుంది.

అంటే మన నోటి ఆరోగ్యం మన గుండె మెదడు ఆరోగ్యంతో దగ్గర సంబంధం కలిగి ఉంది. శాస్త్రవేత్తలు 6వేల మందిని 21 ఏళ్ల పాటు గమనించారు. వాళ్ళలో పళ్ళ చీము క్యావిటీస్ దంతక్షయం ఉన్నవారికి పక్షవాతం వచ్చే అవకాశాలు 86% ఎక్కువ అని తేలింది.

చిన్న చిన్న నోటి ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ వాపులు మన రక్తనాళాలు మెదడుపై మెల్లగా ప్రభావం చూపుతాయి. ఈ ప్రభావం ఒక్క రోజులో కనిపించదు. కానీ సంవత్సరాల తర్వాత పెద్ద సమస్య అవుతుంది. ప్రతిరోజు పళ్ళను శుభ్రంగా ఉంచుకోండి. రోజు రెండు సార్లు బ్రష్ చేయండి. దంత వైద్యుడికి తరుచు చూపించుకుంటూ ఉండండి ఇలా చేస్తే మీ నవ్వు మాత్రమే కాదు మీ మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *